గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి మినప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి ఇడ్లీ రేకులలో వేసి కుకర్లో ఉంచి విజిల్ లేకుండా ఉడికించాలి.