రాగండి పులుసు
 • 499 Views

రాగండి పులుసు

కావలసినవి:

 • రాగండి చేపలు - కేజీ
 • ఉల్లిపాయలు - 2 పెద్దవి
 • పచ్చిమిర్చి - 5 (మధ్యకు చీల్చుకోవాలి)
 • అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూన్‌
 • కారం -2 టేబుల్‌ స్పూన్లు
 • పసుపు - చిటికెడు
 • ఉప్పు - తగినంత
 • నూనె - తగినంత
 • కొత్తిమీర తురుము - 2 టేబుల్‌ స్పూన్లు
 • చింతపండు గుజ్జు - 1 కప్పు

విధానం:

రాగండి చేపల్ని శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. పొయ్యి మీద చేపలగిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేపాలి. అందులోనే చేప ముక్కల్ని వేసి ఉప్పు, కారం బాగా పట్టేలా కలపాలి. సన్న సెగమీద కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పోసి చేప ముక్కలు చితకకుండా కలపాలి. మూతపెట్టి సన్న సెగమీద పులుసు చిక్కగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. ఆఖరులో ధనియాలు, జీలకర్ర పొడి వేసి గిన్నె కదపాలి. ఆ తర్వాత కొత్తిమీర తురుము చల్లుకుని కొద్దిసేపు ఉంచి దించేయాలి. అంతే రాగండి చేపల పులుసు రెడీ.