టొమాటోలను గుజ్జుగా చేసుకోవాలి. బంగాళ దుంపలను ఉడికించి చిదుముకోవాలి. జీడి పప్పులను ముక్కలుగా చేసుకోవలి. బాణలిలో నెయ్యి పోసి కాగనిచ్చి, కిస్మిస్లు వేయాలి. రెండు నిమిషాల తర్వాత, టోమాటో గుజ్జు, బంగాళదుంప గుజ్జును దీనిలో పోసి, అయిదారు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు పంచదార కలిపి పాకంగా చేసుకోవాలి. పాకం అంతా బాగా కలసిన తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ఇష్టం ఉన్న వారు ఆల్మండ్, జీడిపప్పును పైన అందంగా అలంకరించుకోవచ్చు. చల్లారిన తర్వాత కూడా ఈ హల్వా రుచికరంగానే వుంటుంది.