టొమాటో చిత్రాన్నం
  • 485 Views

టొమాటో చిత్రాన్నం

కావలసినవి:

  • అన్నం - రెండు కప్పులు,
  • టొమాటో ముక్కలు - కప్పు,
  • ఉప్పు - తగినంత,
  • కారం - చెంచా,
  • పసుపు - అరచెంచా,
  • ఆవాలు - చెంచా,
  • జీలకర్ర - చెంచా,
  • నూనె - తగినంత

విధానం:

ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్‌లో టీ స్పూను నూనె వేసి కాగిన తరవాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరవాత అందులో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి టొమాటోలను బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. టొమాటో చిత్రాన్నం వేడివేడిగా వడియాల కాంబినేషన్‌తో తింటే బావుంటుంది.