టొమాటో పచ్చడి
  • 191 Views

టొమాటో పచ్చడి

కావలసినవి:

  • టొమాటోలు - అర కిలో
  • పచ్చిమిర్చి - 3
  • ఎండుమిర్చి - 2
  • మెంతులు - అర టీస్పూను
  • మినప్పప్పు - 2 టీస్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూను
  • ఉప్పు - తగినంత
  • ఇంగువ - చిటికెడు
  • పసుపు - పావు టీస్పూను
  • నూనె - 6 టీస్పూన్లు
  • కొత్తిమీర - 1 కట్ట

విధానం:

బాండీలో నూనె వేడిచేసి మెంతులు, మినప్పప్పు వేయించాలి. తర్వాత ఆవాలు వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. ఇవి వేగాక తీసి పక్కనుంచి అదే నూనెలో టొమాటో ముక్కలు వేయాలి. ఉప్పు, పసుపు చేర్చి టొమాటో ముక్కలు వేయించాలి. ఇలా మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాక మూత తీసి మరో 4 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ముక్కలు చల్లారనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి, మినప్పప్పు, మెంతులు మిక్సీలో వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత వేయించిన టొమాటో ముక్కలు వేసి తిప్పాలి. పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించి సర్వ్‌ చేయాలి.