క్రీమ్ టొమాటో సూప్
  • 481 Views

క్రీమ్ టొమాటో సూప్

కావలసినవి:

  • టొమాటోలు - 4,
  • పుదీనా ఆకులు - కొన్ని
  • ఉప్పు - తగినంత
  • మిరియాల పొడి - తగినంత,
  • క్రీమ్ - గార్నిష్‌కి తగినంత
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఆలివ్ ఆయిల్ - అర టీ స్పూన్

విధానం:

టొమాటోలను శుభ్రపరిచి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. దీంట్లో పుదీనా, ఉప్పు వేసి మరో పది నిముషాలు ఉడికించి, చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన టొమాటో మిశ్రమాన్ని పెద్ద జల్లిలో వేసి, వడకట్టి, గింజలను తీసేయాలి. స్టౌ పై కడాయి పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక, అందులో వడకట్టిన టొమాటో మిశ్రమాన్ని పోసి వేడి చేయాలి. కప్పులో పోసి, పైన మిరియాలపొడి చల్లి, క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.