టొమాటో ఆమ్లెట్
 • 485 Views

టొమాటో ఆమ్లెట్

కావలసినవి:

 • టొమాటో ముక్కలు - అరకప్పు,
 • శనగపిండి - పావు కప్పు,
 •  మైదా - పావుకప్పు,
 •  కార్న్‌ఫ్లోర్ - పావు కప్పు,
 • నూనె - తగినంత,
 • టొమాటో సాస్ - మూడు స్పూన్లు,
 •  ఫుడ్‌కలర్ - చిటికెడు,
 • ఉప్పు - తగినంత,
 • కారం - తగినంత,
 •  చక్కెర - చిటికెడు,
 •  నీళ్లు - తగినన్ని

విధానం:

శనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా చేతితో కలపాలి. తరవాత అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, ఫుడ్‌కలర్, ఉప్పు, కారం, చక్కెర వేసి కలిపి తగినన్ని నీటిని జతచేసి దోసెలపిండి మాదిరిగా చేయాలి. దీనిని సుమారు అరగంట సేపు నాననివ్వాలి. పాన్ వేడెక్కిన తరవాత దానిమీద ఈ పిండిని దోసె మాదిరిగా వేసి చుట్టూ నూనె వేసి రెండువైపులా కాలనివ్వాలి. టొమాటో ఆమ్లెట్‌ను వేడివేడిగా తింటే బాగుంటుంది.