ఒక గిన్నె తీసుకుని అందులో టొమాటో తరుగు, ఉల్లితరుగు, క్యాప్సికమ్తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి (ఇలా చేయడం వల్ల ముక్కలలో ఉప్పు బాగా కలిసి రుచి బావుంటుంది). తరవాత అందులో కారం శనగపిండి, సోడా వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోయాలి. బాణలిలో నూనె కాగాక టొమాటో మిశ్రమాన్ని చిన్నచిన్న పకోడీల మాదిరిగా వేసి బంగారురంగులోకి వచ్చాక తీసేయాలి. వీటిని వేడివేడిగా టొమాటోసాస్తో తింటే చాలా బావుంటాయి.