ఒక పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కాగిన తరవాత ఉల్లిపాయముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి 5 నిముషాలు ఉడికించి ఉప్పు, కారం కలపాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి 5 నిముషాలు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని పిజ్జా బేస్ మీద పరిచి పైన బీన్స్ తరుగు వేయాలి. దీనిని 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 5 నిముషాలు బేక్ చేయాలి.