టమాటా పలావ్‌
 • 345 Views

టమాటా పలావ్‌

కావలసినవి:

 • బాస్మతి బియ్యం - 1 కప్పు
 • సోయా గింజలు - 1/2 కప్పు
 • జీలర్ర - 1 టీస్పూన్‌,
 • బిర్యానీ ఆకు - 1
 • సన్నగా తరిగిన ఉల్లిముక్కలు - 1/2 కప్పు
 • అల్లం పేస్ట్‌ - 1 టీ స్పూన్‌
 • టమాటా గుజ్జు - 1/2 కప్పు
 • ఎండుమిర్చి - 3 (కచ్చాపచ్చాగా నూరి)
 • నీళ్ళు - 2 1/2 కప్పులు
 • జాజికాయ పొడి - 1/2 టీ స్పూను
 • ఉప్పు - తగినంత

గార్నిషింగ్‌కి:

 • ఉడకబెట్టిన బఠాణీలు
 • తరిగిన అల్లం

విధానం:

బియ్యాన్ని బాగా కడిగి పావుగంట సేపు నానబెట్టాలి. సోయా గింజలను ఒక కప్పు నీటిలో నానబెట్టాలి. మందపాటి గిన్నెను తీసుకుని అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. అందు లో ఉల్లిపాయ, అల్లం, జాజికాయపొడి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వ చ్చే వరకూ వేయించాలి. తర్వాత అందులో నానబెట్టిన సోయా గిం జలు వేసి పొడి అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత ఒక కప్పు నీరు పోసి కారం, ఉప్పు వేసి పొంగురానివ్వాలి. అందులో బియ్యం వేసి రెండు నిమిషాలు ఉండికించాలి. తర్వాత మంట తగ్గించి బియ్యం సగంపైన ఉడికేదాకా ఉంచి అం దులో టమాటా గుజ్జు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఒక ఐదు నిమిషాల పాటు మూత తియ్యకుండా ఉంచాలి. సర్వ్‌ చేసే సమయంలో దానిపై ఉడకబెట్టిన బఠాణీ, అల్లం ముక్కలు వేసి వడ్డించవచ్చు.