టొమాటో సూప్‌
  • 556 Views

టొమాటో సూప్‌

కావలసినవి:

  • టొమాటో ముక్కలు - 4 కప్పులు
  • బిరియాని ఆకు - 1
  • మిరియాలు - పావు టీ స్పూను
  • వెన్న - ఒకటిన్నర టీ స్పూను
  • మైదా - 1 టే.స్పూను
  • టొమాటో గుజ్జు - పావు కప్పు
  • చక్కెర - 2 టీస్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • మీగడ - ఒకటిన్నర టీస్పూను

 
అలంకరణకు:

  • తాజా మీగడ - 2 టీస్పూన్లు
  • వేయించిన బ్రెడ్‌ ముక్కలు - పావు కప్పు

విధానం:

టొమాటో ముక్కలకు ఒక కప్పు నీరు, బిరియాని ఆకు, మిరియాలు చేర్చి మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. బిరియాని ఆకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గుజ్జును మెత్తగా రుబ్బి వడగట్టాలి. బాండీలో వెన్న వేడి చేసి మైదా వేసి మీడియం మంట మీద 1 నిమిషంపాటు ఉడికించాలి. దీన్లో ముందుగా తయారుచేసిపెట్టుకున్న టొమాటో మిశ్రమం, టొమాటో గుజ్జు, ఒక కప్పు నీళ్లు చేర్చి కలిపి 1 నిమిషంపాటు ఉడికించాలి. చక్కెర, ఉప్పు, మిరియాలపొడి, మీగడ వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. తాజా మీగడ, బ్రెడ్‌ ముక్కలతో అలంకరించి సర్వ్‌ చేయాలి