టమాటా సూప్‌
  • 834 Views

టమాటా సూప్‌

కావలసినవి:

  • కావల్సిన పదార్థాలు
  • టమాటా-250 గ్రాములు,
  • కార్న్‌ ఫ్లోర్‌- 2 టేబుల్‌ స్పూన్న్‌,
  • మిరియాల పొడి-1/2 టీ స్పూన్‌,
  • ఉప్పు -తగినంత

విధానం:

ఈ సూప్‌ కోసం హైబ్రీడ్‌ టమాటాలు తీసుకోవాలి. గుజ్జు ఎక్కువగా ఉంటుంది. గ్లాసుడు నీళ్ళు పోసి టమాటాలను పది నిమిషాలు ఉడికించాలి. చల్లారాక ముక్కలు చేసి గ్రైండ్‌ చేయాలి. ఇది వడగట్టుకోవాలి. పాన్‌ వేడి చేసి ఈ టమాటా రసం పోసి మరిగించాలి. మరుగుతుండగా ఉప్పు, మిరయాల పొడి వేయాలి. కార్న్‌ ఫ్లోర్‌ అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న టమాటా రసంలో ఈ కార్న్‌ ఫ్లోర్‌ మిశ్రమం వేసి ఉండలు కట్ట కుండా కలుపుతూ ఉండాలి. రెండు నిమిషాలు మరిగిన తర్వాత దింపేసి వేయించిన బ్రెడ్‌ ముక్కలు కాని, కొత్తిమీర కాని వేసి వేడిగా సర్వ్‌ చేయాలి.