టమాటా ఉప్మా
 • 535 Views

టమాటా ఉప్మా

కావలసినవి:

 • అరకప్పు
 • టమాట గుజ్జు: కప్పుఆవాలు: టీస్పూన్‌
 • సెనగపప్పు: టీ స్పూన్‌
 • జీడిపప్పు: పది
 • పల్లీలు: కొద్దిగా
 • నూనె: టేబుల్‌ స్పూన్‌
 • నెయ్యి: అర కప్పు
 • ఉల్లిముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు అల్లం ముక్కలు : ఒక కప్పు
 • కరివేపాకు: కొద్దిగా
 • ఉప్పు: తగినంత
 • నిమ్మ రసం: ఒక టీ స్పూన్‌
 • కొత్తిమీర: కొద్దిగా

విధానం:

స్టౌ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు వేయించాలి. తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. టమాటా గుజ్జు కలిపి, రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు కలిపి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా మూత తీసి రవ్వ పోస్తూ బాగా కలిపి గట్టి పడ్డాక స్టౌ ఆపాలి.
ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమీర వేసి మూత పెట్టాలి.