చింతపండు గిన్నెలో నానబెట్టి రసం తియ్యాలి. మామిడికాయ, అరటిపండ్లు చిన్నచిన్న ముక్కలు చెయ్యాలి. బెల్లం సన్నగా తరగాలి. చింతపండు రసంలో... తరిగిన బెల్లం, అరటికాయ ముక్కలు, మామిడి, వేపపువ్వు, కారం, ఉప్పు వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు ఉంచి తినేయొచ్చు (కారానికి బదులు మిర్చి ముక్కలు కూడా వాడుకోవచ్చు). కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా, కొంచెం కారంగా, కొంచె ఉప్పగా, చిరు చేదు ఉన్నా కూడా బావుంటుంది. ఇష్టమైనవాళ్లు చెరుకు ముక్కలు కూడా వేసుకోవచ్చు.