ఉల్లిపాయలను ఒలిచి సన్నగా పొడవుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని పొడవుగా చీలికలు చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పల్లీలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగిన తరవాత ఆ నూనెలో పకోడీలు వేసి గోధుమరంగు వచ్చాక తీసేయాలి. వీటిని సాస్‌తో తింటే బావుంటాయి.