ఉల్లికాడసూప్
  • 579 Views

ఉల్లికాడసూప్

కావలసినవి:

  • ఉల్లికాడల తరుగు (తెల్లని కింద భాగం మాత్రమే) - 4 కప్పులు,
  • బంగాళదుంప ముక్కలు -4 కప్పులు,
  • ఉప్పు - రుచికి తగినంత,
  • మిరియాల పొడి - చిటికెడు,
  • నీరు - 7 కప్పులు,
  • కొత్తిమీర - అర టేబుల్ స్పూను,
  • క్రీమ్ - అర కప్పు.

విధానం:

దళసరి అడుగున్న పాత్రలో ఉల్లికాడ తరుగు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి 7 కప్పుల నీరు చేర్చి మెత్తబడేదాకా (దాదాపు 20 - 30 నిమిషాలు) ఉడికించాలి. తర్వాత మిరియాల పొడి, క్రీమ్ కలిపి చల్లబడ్డాక కొత్తిమీర చల్లి తాగాలి.