ఉండ్రాళ్ళ పాయసం
  • 262 Views

ఉండ్రాళ్ళ పాయసం

కావలసినవి:

  • పాలు: 1లీ"
  • బియ్యంపిండి:1గ్లాసు
  • నీళ్ళు:1గ్లాసు
  • కొబ్బరి:1కప్పు(తురిమినది)
  • నువ్వులపొడి:1కప్పు
  • పంచదార:150గ్రా
  • ఏలకులపొడి:2స్పూన్లు
  • నెయ్యి:2స్పూన్లు
  • ఉప్పు:చిటికెడు

విధానం:

ముందుగా ఒక పాత్రలొ గ్లాసు నీళ్ళు తీసుకొని మరిగించాలి .
నీళ్ళు మరుగుతుండగానె అదే గ్లాసుతో బియ్యపు పిండి తీసుకొని మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.
ముద్ద చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
ఇప్పుడు కొబ్బరితురుము,నువ్వులపొడి కాస్తా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాలు బాగా మరిగించి అందులో పంచదార కలిపి ఉండ్రాళ్ళు వేసి ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత (పాయసం మరింత చిక్కగా కావాలానుకుంటే కొద్దిగా పాలు తీసుకొని అందులొ బియ్యపు పిండిని కలిపి ఆచిక్కని మిశ్రమాన్ని పాలు మరుగుతున్నప్పుడు కలపాలి) కొబ్బరితురుము,నువ్వులపొడి,ఏలకులపొడి కలపాలి.
కమ్మని సువాసనతో పాయసం మీకొసం...