ఉప్మా బొండం
 • 414 Views

ఉప్మా బొండం

కావలసినవి:

 • శనగపిండి: ఒక కప్పు
 • బియ్యం పిండి: 1/2 కప్పు
 • బంగాళ దుంపలు ముక్కలుగా తరిగిన బీన్స్‌టమాటా ముక్కలు
 • ఆవాలు: ఒక స్పూన్‌
 • పచ్చిమిర్చి:3 (చిన్న ముక్కలుగా తరగాలి) వంట సోడా : చిటికెడు
 • నూనె: తగినంత
 • క్యారెట్‌: 1 (తురమాలి)
 • కరివేపాకు
 • తరిగిన ఉల్లిపాయలు
 • తరిగిన అల్లం
 • జీడిపప్పు
 • ఉప్పు: రుచికి సరిపడా
 • కారం: ఒక స్పూన్‌

విధానం:

ఒక పాన్‌ను పొయ్యి మీద పెట్టి నూనె పోసి ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం వేయించాలి. ఆ తర్వాత బంగాళ దుంప ముక్కలు, బీన్స్‌ ముక్కలు, టమోటా ముక్కలు రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత మూడు గ్లాసుల నీటిని పోసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత రవ్వ పోసి ఉండలు కట్టకుండా కలపాలి. ఒక నిమిషం అయ్యాక స్టౌ ఆఫ్‌ చేయాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోవాలి. ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు, కారం వేసి బజ్జీల మాదిరిగా కలుపుకోవాలి. ఈ పిండిలో పైన తయారు చేసుకున్న బాల్స్‌ని ముంచి నూనెలో గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు డీప్‌ ఫ్రై చేయాలి.