మినప జంతికలు
  • 1010 Views

మినప జంతికలు

కావలసినవి:

  • బియ్యం - 3 కప్పులు,
  • మినప్పప్పు - కప్పు,
  • వాము - టీ స్పూను,
  • ఉప్పు, కారం - తగినంత,
  • నూనె - వేయించడానికి తగినంత

విధానం:

మినప్పప్పును గోధుమరంగు వచ్చేవరకు వేయించి, చల్లారాక బియ్యంతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, వాము, గరిటెడు నూనె వేసి కలపాలి. తగినంత నీరు పోసి ముద్దలా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. జంతికల గొట్టంలో పిండి ముద్దను పెట్టి, కాగుతున్న నూనెలో జంతికల మాదిరి ఒత్తుకోవాలి. రెండువైపులా దోరగా వేగాక తీసేయాలి.