వంజరం చేపల వేపుడు
  • 791 Views

వంజరం చేపల వేపుడు

కావలసినవి:

  • వంజరం చేప-అరకేజీ కన్నా కొద్దిగా తక్కువ,
  • అల్లం వెల్లుల్లి పేస్టు-రెండు టేబుల్‌ స్పూన్లు,
  • ఉప్పు-తగినంత,
  • మిరియాల పొడి-పావు చెంచా,
  • నిమ్మ రసం-రెండు టేబుల్‌ స్పూన్లు,
  • మైదా- అర కప్పు,
  • కోడి గుడ్లు-రెండు,
  • బ్రెడ్‌ పొడి-కప్పు,
  • నూనె- వేయించడానికి సరిపడా

విధానం:

చేపను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలు కోయాలి. వీటిని గిన్నెలోకి తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్టూ తగినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి కనీసం గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. కోడి గుడ్లు సొనను తీసుకుని గిలకొట్టాలి. గంట తరువాత చేప ముక్కల్ని బయటకు తీసి మైదా, గుడ్డు సొన పట్టించి, చివరగా బ్రెడ్‌ పొడి అద్దాలి. ఇలా చేసుకున్న వాటిని నూనెలో వేయించుకుంటే సరిపోతుంది.