వటయాప్పం
  • 686 Views

వటయాప్పం

కావలసినవి:

  • బియ్యం-రెండున్నర కప్పులు, ( మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి),
  • కొబ్బరి కాయ-చిన్నది ఒకటి.( తురిమి పెట్టుకోవాలి) యీస్ట్‌ - మూడు నాలుగు చెంచాలు.
  • ఉప్పు-తగినంత చక్కెర-అర కప్పు,
  • కిస్‌మిస్‌ ,
  • జీడిపప్పు-కొన్ని ,
  • యాలకులు-ఐదు

విధానం:

ముందుగా నానబెట్టిన బియ్యంలో నాలుగు టేబుల్‌ స్పూన్లు విడిగా తీసుకుని మెత్తగా దోశపిండిలా గరిటెజారుగా రుబ్బుకోవాలి. ఈ పిండిని బాణలిలో వేసి పొయ్యిమీద పెట్టాలి.ఈ పిండిని బాణలిలో వేసి పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి గట్టిపడుతుంది. అప్పుడు దింపేయాలి. ఇప్పుడు కిస్‌ మిస్‌, జీడిపప్పు తప్ప మిగిలిన పదార్థాల్ని తీసుకుని కొద్దికొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పిండిని వేసి బాగా కలిపి ఓ పెద్ద గిన్నెలోకి తీసుకుని ఓ రాత్రంతా నాననివ్వాలి. మర్నాటికి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని నెయ్యి రాసిన గిన్నెలోకి సగం దాకా తీసుకుని పైన కిస్‌మిస్‌, జీడిపప్పు చల్లి ఆవిరి మీద పది నిమిషాల వరకూ ఉడికించి తీసుకోవాలి. దీన్ని చికెన్‌ కర్రీ లేదా ఎగ్‌ కర్రీతో కలిపి అల్పాహరంలా వడ్డించాలి.