వెజ్‌ కేక్‌
  • 547 Views

వెజ్‌ కేక్‌

కావలసినవి:

  • పాలు - అర లీటర్‌,
  • వెన్న - 150 గ్రాములు
  • వెనిల్లా ఎసెన్స్‌ - 3 స్పూన్లు
  • మైదాపిండి - 250 గ్రాములు
  • పంచదార - 150 గ్రాములు
  • బేకింగ్‌ పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

విధానం:

పాలు చిక్కగా మరిగించి ఆరబెట్టాలి. జల్లించిన మైదాపిండిలో బేకింగ్‌ పౌడర్‌, పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్‌, వెన్న, చిక్కటి పాలు పోసి బాగా కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌ లో పెట్టి ఉడికించాలి. లేదా కేక్‌బాక్సులో పోసి సన్నసెగమీద ఉడికించాలి.