వెజ్‌ మంచూరియా
 • 856 Views

వెజ్‌ మంచూరియా

కావలసినవి:

 • క్యాబేజీ తరుగు - 1 కప్పు,
 • క్యారెట్‌ తరుగు - 1 కప్పు
 • ఉల్లికాడ తరుగు - 1 కప్పు,
 • పచ్చిమిర్చి ముక్కలు - 1 స్పూన్‌,
 • వెల్లుల్లి ముక్కలు - 1 స్పూన్‌,
 • కార్న్‌ఫ్లోర్‌ - అరకప్పు, మైదా- అరకప్పు,
 • సోయాసాస్‌- 1 స్పూన్‌,
 • ఉప్పు - తగినంత
 • మిరియాల పొడి- 1 స్పూన్‌,
 • పంచదార- 1 స్పూన్‌
 • అజినమోటో - చిటికెడు,
 • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

క్యాబేజీ, క్యారెట్‌ ముక్కలు, ఉప్పు కలిపి కొద్దిసేపు ఉంచాలి. ఈ ముక్కలకి కార్న్‌ఫ్లోర్‌, మైదా, ఉప్పు చేర్చి గట్టిగా కలపాలి. అసరమైతే కొబ్బరి నీళ్లు కలపొచ్చు. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి నూనెలో బంగారు రంగు వచ్చేదాక వేయించాలి.
మరొక బాండీలో రెండు స్పూన్లు నూనె వేడి చేయాలి. వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, వేయించాలి. కొద్దిగా నీళ్లు పోసి, ఉప్పు, మిరియాల పొడి, అజినమోటో పంచదార, సోయాసాస్‌ కలపాలి. ఐదు నిమిషాలయ్యాక వేయించిపెట్టుకున్న ఉండల్ని ఈ మిశ్రమంలో కలపాలి. దీన్ని సన్నమంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. సర్వ్‌ చేసేముందు ఉల్లికాడ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరిస్తే బావుంటుంది.