వెజ్ షాంగ్రీలా
  • 230 Views

వెజ్ షాంగ్రీలా

కావలసినవి:

  • క్యారట్ తురుము - 10 గ్రా
  • బీన్స్ తరుగు - పావు కప్పు;
  • పనీర్ - 10 గ్రా
  • బఠాణీ - 10 గ్రా;
  • ఉప్పు - తగినంత
  • జీడిపప్పు పలుకులు - 10 గ్రా;
  • బ్రెడ్ క్రంప్స్ - 50 గ్రా
  • చైనా సాల్ట్ - అర టీ స్పూను;
  • మిరప్పొడి - అర టీస్పూను
  • మిరియాల పొడి - అర టీ స్పూను
  • వెల్లుల్లి పేస్ట్ - టీస్పూ;
  • చిల్లీ సాస్ -టీ స్పూను

విధానం:

ఒక బౌల్ తీసుకుని అందులో అన్నిరకాల కూరముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత మసాలా పదార్థాలు, బ్రెడ్ క్రంప్స్ వేసి కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. వీటిని వడల మాదిరిగా ఒత్తి ఒక్కోదానిమీద జీడిపలుకు అద్ది పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించి తీసేయాలి.