ఎగ్‌ వెజిటబుల్‌ ఫ్రెడ్‌రైస్‌
 • 448 Views

ఎగ్‌ వెజిటబుల్‌ ఫ్రెడ్‌రైస్‌

కావలసినవి:

 • కోడిగుడ్లు -2,
 • బియ్యం - అరకిలో
 • క్యారెట్‌ ముక్కలు - అరకప్పు
 • బీన్స్‌ ముక్కలు - అరకప్పు
 • పచ్చిబఠాణీలు - అరకప్పు,
 • పచ్చిమిర్చి - 2
 • సోయాసాస్‌ - 1 స్పూన్‌,
 • టమాటాసాస్‌ -1 స్పూన్‌
 • అజినమోటో - చిటికెడు,
 • ఉప్పు - తగినంత
 • కారం - 1 స్పూన్‌,
 • మిరియాలపొడి - అర స్పూన్‌
 • కొత్తిమీర తురుము - అర కప్పు,
 • నూనె - తగినంత

విధానం:

ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండిలో కొంచెం నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కోడి గుడ్ల సొన వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత క్యారెట్‌, బీన్స్‌, బఠాణీలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో అన్నం వేసి బాగా కలపాలి. తర్వాత అజినోమోటో, టమాటాసాస్‌, సోయాసాస్‌, ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే వేడి వేడి ఎగ్‌ వెజిటబుల్‌ ఫ్రైడ్‌రైస్‌ రెడీ.