వెజిటేబుల్‌ ఖిచిడీ
  • 364 Views

వెజిటేబుల్‌ ఖిచిడీ

కావలసినవి:

  • బియ్యం - రెండు కప్పులు,
  • కారెట్‌ -2, బీన్స్‌ -10
  • కాబేజీ తురుము- ఒక కప్పు
  • పెసరపప్పు- 1కప్పు,
  • బఠాణీ - 1/2 కప్పు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క,
  • ఉప్పు - తగినంత,
  • లవంగాలు- 5,
  • పచ్చిమిర్చి -3,
  • నూనె - 1/3 కప్పు
  • జీలకర్ర - 1 స్పూన్‌,
  • ఆవాలు - 1స్పూన్‌,
  • ఉల్లిపాయలు -3,
  • పసుపు - చిటికెడు,
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 1/2 స్పూన్లు
  • గరం మసాల - 1 టీస్పూను

విధానం:

బియ్యం, పెసరపప్పు కలిపి క గంటసేపు నానబెట్టాలి. ఉల్లిపాయలు, కారె ట్‌, బీన్స్‌ను సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో కాస్త నూనె పోసి అందు లో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. అందులో దాల్చిన చెక్క, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేసి బాగా కలిపి వేయించాలి. తర్వాత అందులో కోసి పెట్టుకున్న కాయగూరలు, బఠాణీలు వేసి సన్న మంటపై ఉడికించాలి. సగం ఉడికిన వాటి లో బియ్యం, పెసలు వేసి కాసేపు వేయించాలి. తర్వా త అందులో నాలుగు కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి కుక్కర్‌ మూత పెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చే దాకా ఉండనివ్వాలి. వేడి వేడి వెజిటేబుల్‌ ఖిచడీ రెడీ. ఇందులో ఆలూ కూర్మా, సాంబర్‌ బాగుంటాయి.