వెజిటబుల్ కుర్మా
 • 324 Views

వెజిటబుల్ కుర్మా

కావలసినవి:

సెక్షన్ - ఎ:

 • కొబ్బరితురుము - 4 టేబుల్ స్పూన్లు;
 • అల్లం - అర టీ స్పూన్ (సన్నగా తరగాలి);
 • వెలుల్లి గడ్డ - 1;
 • లవంగం - 1;
 • దాల్చినచెక్క - చిన్న ముక్క;
 • మెంతులు - టీ స్పూన్;
 • ఉల్లిపాయ (చిన్నది) - 1 (సన్నగా తరగాలి);
 • పచ్చిమిర్చి - 2; మిరియాలు - తగినన్ని;
 • జీడిపప్పు - 5;

సెక్షన్ - బి:

 • కాలీఫ్లవర్ - కప్పు;
 • పచ్చిబఠాణీలు - అర కప్పు;
 • బీన్స్ (సన్నగా తరగాలి) - కప్పు;
 • క్యారట్ ముక్కలు - కప్పు;
 • బంగాళదుంపముక్కలు - కప్పు;
 • నీళ్లు - కప్పు;
 • ఉల్లిపాయ (చిన్నది) - 1 (సన్నగా తరగాలి);
 • నూనె - టేబుల్ స్పూన్;
 • ఆవాలు - అర టీ స్పూన్;
 • పసుపు - చిటికెడు

విధానం:

మెంతులు మినహా సెక్షన్ - ‘ఎ’లో ఉన్న పదార్థాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక ఆవాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేసి గోధుమవర్ణం వచ్చేవరకు వేయించుకోవాలి సెక్షన్ - ‘బి’ లో ఉన్న కూరగాయ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించాలి సెక్షన్ ‘ఎ’లో పదార్థాలను గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి కలపాలి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి కూరగాయముక్కలు ఉడికేంతవరకు ఉంచి, కొత్తిమీర చల్లి దించాలి అన్నంలోకి ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది.