పనీర్‌ వెజిటబుల్‌ దోశ
  • 256 Views

పనీర్‌ వెజిటబుల్‌ దోశ

కావలసినవి:

  • గ్రాములు,
  • ఉల్లిపాయ ముక్కలు-అరకప్పు,
  • టొమాటోలు- రెండు,
  • క్యాప్సికం-ఒకటి,
  • క్యాబేజీ తరుగు-కప్పు,
  • పచ్చిమిర్చి-ఆరు,
  • సోయా సాస్‌-నాలుగు చెంచాలు,
  • కారం-టేబుల్‌ స్పూన్లు,
  • ఉల్లికాడల తరుగు-కప్పు,
  • కొత్తిమీర-కట్ట,
  • చీజ్‌ ముక్కలు-కొన్ని,
  • ఉప్పు కలపని వెన్న-కప్పు,
  • నూనె-కప్పు,
  • ఉప్పు-తగినంత,
  • టొమాటో సాస్‌-అర కప్పు.

విధానం:

ముందుగా పనీర్‌ టొమాటోలూ, క్యాప్సికం, పచ్చిమిర్చి, కొత్తిమీరను విడివిడిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెనం వేడిచేసి దానిపై పిండిని పల్చని దోశలా పరవాలి. మధ్యలో చెంచా వెన్న దానిపై ఉల్లిపాయ , క్యాబేజీ, టొమాటో ముక్కలు చెంచా చొప్పునా కొద్దిగా క్యాప్సికం, పచ్చి మిర్చి ముక్కల్ని వేసేయాలి. ఇప్పుడు కొంచెం సోయా సాస్‌, కొద్దిగా కారం, గరం మసాలా దోశంతా పడేలా చల్లాలి. ఈ ముక్కలపై కొద్దిగా టొమాటో సాస్‌, పనీర్‌ తరగూ, తగినంత ఉప్పు, ఉల్లికాడల తరుగూ కొద్దిగా నూనె వేసుకుని దోశలా కాల్చుకోవాలి. దానిపైన మళ్లీ కొద్దిగా వెన్న, కొత్తిమీర తరుగూ చీజ్‌ ముక్కలూ వేస్తే సరిపోతుంది. దోశను మధ్యకు మడిచి పళ్లెంలోకి తీసుకుని కొబ్బరి చట్నీతో కలిపి వడ్డించాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.