గుమ్మడి కాయ తురుములో నీరంతా పిండాలి. సొరకాయ తురుము నేతిలో దోరగా వేయించాలి. అందులోనే పాలు పోసి ఉడికించాలి. పాలు మొత్తం ఇంకిపోయాక నీరు తీసేసిన గుమ్మడి తురుము, మీగడ, పంచదార వేసి దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి. ఇలా నెయ్యి పైకి తేలేవరకు తిప్పుతూనే ఉండాలి. తర్వాత వెనిల్లా ఎసెన్స్, ఇష్టమైన వాళ్లు మిఠాయి రంగు కూడా వేసుకుని కలియదిప్పాలి. దీన్ని ఒక ప్లేట్లో సమానంగా పొయ్యాలి. దీనిపైన వేయించిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ చల్లి ముక్కలు కోసుకోవాలి. ఈ హల్వా చాలా రుచిగా వుంటుంది.