వెజిటబుల్ స్ట్యూ
 • 487 Views

వెజిటబుల్ స్ట్యూ

కావలసినవి:

 • క్యార ట్ - 2, బీన్స్ - 10,
 • బంగాళదుంప - 2,
 • కొబ్బరిపాలు - కప్పు,
 • కరివేపాకు - రెండు రెమ్మలు,
 • నూనె - 50 గ్రా., ఉల్లితరుగు - అరకప్పు,
 • పచ్చిమిర్చి - 6,
 • ఉప్పు - తగినంత,
 • మిరియాలు - 10 గ్రా.,
 • అల్లం - 10 గ్రా.
 • కొత్తిమీర - కొద్దిగా

విధానం:

ముందుగా క్యారట్, బీన్స్, బంగాళదుంపలను చిన్నముక్కలుగా కట్ చేసి వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడయ్యాక అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరవాత కరివేపాకు, ఉడికించిన కూరముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.