వెజిటేబుల్‌ ఉప్మా
  • 114 Views

వెజిటేబుల్‌ ఉప్మా

కావలసినవి:

  • క్యాబేజీ - చిన్న ముక్క
  • క్యారెట్‌ - ఒకటి
  • బీట్‌ రూట్‌ - ఒకటి
  • ముల్లంగి - ఒకటి
  • ఉల్లిపాయ - రెండు
  • ఉప్పు- సరిపడినంత
  • పచ్చిమిర్చి- మూడు
  • పోపు దినుసులు- ఒక టీస్పూన్‌
  • కరివేపాకు- ఒక రెమ్మ
  • కొత్తిమీర - కొద్దిగా
  • అల్లం - చిన్న ముక్క
  • చాట్‌ మసాల- ఒక టీస్పూన్‌
  • నిమ్మకాయ - చిన్న ముక్క

విధానం:

ముందుగా క్యాబేజీ, క్యారెట్‌, మల్లంగి, బీట్‌రూట్‌లను సన్నగా తురుము కోవాలి. వీటిని కుక్కర్‌లో వేసి కొద్దిగా నీరు, ఉప్పు వేసి ఉడికించుకో వాలి. ఉడికిన తరువాత అందులో వున్న నీటిని వార్చుకోవాలి. పెనంపెట్టి వేడయ్యాక కొద్దిగా నూనె వేసుకోవాలి. పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి. వేగిన తరువాత ఇందులో ఉడికించుకున్న కూరగాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. పది నిమిషాలు మగ్గనివ్వాలి. దించుకునే ముందు కొద్దిగా చాట్‌ మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. నిమ్మరసం పిండుకుని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిది.