సేమియా బిసబేళబాత్
 • 395 Views

సేమియా బిసబేళబాత్

కావలసినవి:

 • సేమియా - 200 గ్రా.
 • కందిపప్పు - 100 గ్రా.
 • మునగకాడలు - 2
 • వంకాయ ముక్కలు - 50 గ్రా.
 • ఉల్లి తరుగు - 50 గ్రా.
 • క్యారట్ తరుగు - 50 గ్రా.
 • టొమాటో తరుగు - 50 గ్రా.
 • పచ్చిమిర్చి తరుగు - 4
 • ఆవాలు - స్పూను
 • జీలకర్ర - స్పూను
 • ఇంగువ - చిటికెడు
 • చింతపండురసం - అర కప్పు
 • ఎండుమిర్చి - 2, లవంగాలు - 3
 • పసుపు - పావు టీ స్పూను
 • దాల్చినచెక్క - చిన్నముక్క
 • కరివేపాకు - ఒక రెమ్మ
 • కొత్తిమీర - చిన్న కట్ట
 • నూనె - గరిటెడు, ఉప్పు - తగినంత
 • కారం - అర టీస్పూను
 • సాంబారు పొడి - స్పూను

విధానం:

మూడు కప్పుల నీటిలో టీ స్పూను నూనె వేసి సేమియాను ఉడికించాలి. ఉడికిన సేమ్యాను చల్లని నీటితో బాగా కడిగి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరవాత లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత కూర ముక్కలన్నీ వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక చింతపండురసం, సాంబారు పొడి వేసి బాగా కలిపి, ఉప్పు, కారం, ఉడికించిన కందిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి పది నిమిషాలసేపు ఉడికించాలి. చివరగా ఉడికించిన సేమియా, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి.