సేమియా దహీవడ
 • 306 Views

సేమియా దహీవడ

కావలసినవి:

 • మినప్పప్పు - కప్పు
 • సేమియా - కప్పు
 • పెరుగు - మూడు కప్పులు
 • పచ్చిమిర్చి - 3
 • అల్లం - చిన్నముక్క
 • ఆవాలు - స్పూను
 • జీలకర్ర - చెంచా
 • ఎండుమిర్చి - రెండు
 • కరివేపాకు - చిన్న రెమ్మ
 • పసుపు - చిటికెడు
 • ఉప్పు - తగినంత
 • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

మినప్పప్పు రెండు గంటల పాటు నానిన తరవాత నీళ్లు వంపేసి పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. సేమియాను మూడు కప్పుల నీటిలో ఉడికించి వడకట్టుకోవాలి. సేమియా చల్లారాక అందులో రుబ్బిన పిండి, ఉప్పు వేసి కలపాలి. బాణలిలో టీ స్పూను నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరవాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిని పసుపు, ఉప్పు వేసిన పెరుగులో వేయాలి. పిండిని గారెల మాదిరిగా ఒత్తి కాగిన నూనెలో ఎరగ్రా వేయించుకోవాలి. గిన్నెలో నీళ్లు తీసుకుని వేయించిన గారెలను అందులో రెండు నిముషాలు ఉంచి తీసి నీటిని పిండేసి పెరుగులో వేయాలి.