వైజాగ్ చికెన్‌ బిర్యానీ
 • 306 Views

వైజాగ్ చికెన్‌ బిర్యానీ

కావలసినవి:

 • బియ్యం - అర కిలో,
 • చికెన్‌ - అర కిలో,
 • పెరుగు - పావు లీటర్‌
 • డాల్డా - 100 గ్రా||,
 • నిమ్మకాయలు - 1,
 • పచ్చిమిర్చి - 6
 • కారం - 1 స్పూను,
 • ఉప్పు - తగినంత
 • కొత్తిమీర - 1 కట్ట,
 • పుదీనా - 1 కట్ట,
 • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
 • ఉల్లిగడ్డలు - 3 పెద్దవి,
 • లవంగాలు - 5
 • యాలుకులు - 4,
 • దాల్చిన చెక్క - కొంచెం,
 • షాజీర - టీ స్పూను

విధానం:

డాల్డాలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి. కడిగిన చికెన్‌ను పెద్ద గిన్నెలో వేసుకోవాలి. దానికి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, వేయించిన ఉల్లిగడ్డముక్కలు సగం, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, పెరుగు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, షాజీర, డాల్డా కూడా కొంచెం కలిపి ఒక గంట నానబెట్టాలి. తర్వాత బియ్యం సగం ఉడికాక (అంటే అన్నం పలుకుగా వుండాలి) నీళ్లు మొత్తం వొంపేయాలి. ఆ బియ్యాన్ని, దినుసులన్నీ కలిపిన చికెన్‌ మిశ్రమం పైన వేయాలి. మిగిలిన డాల్డా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, వేపిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ రసం కూడా బియ్యం పైన వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత సన్న సెగ మీద మరో పదినిమిషాలు ఉంటే చాలు. ఉడికేటప్పుడు ఆవిరి పోకుండా చూసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్‌ బిర్యానీ రెడీ. తినేముందు చికెన్‌... అన్నం కలిసేలా కలియదిప్పాలి. మటన్‌ బిర్యానీ కూడా ఇలాగే చేసుకోవచ్చు.