పుచ్చకాయ రసం
  • 421 Views

పుచ్చకాయ రసం

కావలసినవి:

  • పుచ్చ ముక్కలు - 2 కప్పులు
  • మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు
  • పుదీనా ఆకులు - 3
  • ఐస్‌ ముక్కలు - సరిపడినన్ని (ఇష్టమైతే వేసుకోవచ్చు)

విధానం:

మిక్సీలో పుచ్చముక్కలు, మిరియాల పొడి, పుదీనా ఆకులు, ఐస్‌ ముక్కలు వేసి గ్రైండ్‌ చెయ్యాలి (తీపి సరిపోదనుకునేవారు కొంచెం పంచదార వేసుకోవచ్చు). దీన్ని అరగంట ఫ్రీజర్‌లో పెట్టి తర్వాత సర్వ్‌ చేయండి. ఎంత ఎండలో వచ్చిన వారైనా ఈ పానీయం తాగితే కూల్‌ కూల్‌ అయిపోతారు.