పుచ్చపండు షర్బత్
  • 455 Views

పుచ్చపండు షర్బత్

కావలసినవి:

  • పుచ్చపండు ముక్కలు – 3 కప్పులు
  • చాట్ మసాలా – చిటికెడు

విధానం:

పుచ్చపండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తియ్యగా ఉంటుంది కాబట్టి నీళ్లు, చక్కెర కలపనవసరంలేదు. చాలా త్వరగా తయారవుతుంది కూడా. పుచ్చపండును కోసి మధ్యలో గుజ్జును చిన్న ముక్కలుగా చేసుకుని బ్లెండర్లోవేసి ఒక్క నిమిషం తిప్పితే చాలు లేకుంటే గింజలు కూడా క్రష్ అవుతాయి. ఈ రసాన్ని వడకట్టి ,చాట్ మసాలా కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఒకవేళ పండు తియ్యగా లేకుంటే కొద్దిగా చక్కెర లేదా తేనె కలపవచ్చు. బాగా చల్లబడ్డాక  సర్వ్ చేయండి. పిల్లలు,పెద్దలు అందరూ ఇష్టపడతారు..  ఇంకా తొందరగా కావాలంటే ముందుగా ముక్కలు కట్ చేసి ఫ్రిజ్ లోపెట్టండి. కావాలనుకున్నప్పుడు బ్లెండర్లోవేసి రసం తీసుకొని,వడకట్టి  సర్వ్ చేయండి.