పెరుగు చికెన్ కూరా
 • 213 Views

పెరుగు చికెన్ కూరా

కావలసినవి:

 • ఉల్లిపాయలు... రెండు
 • పెరుగు... అరకప్పు
 • చికెన్... అర కిలో
 • అల్లం... 15 గ్రాములు
 • పచ్చిమిర్చి... నాలుగు
 • కారం... ఒక స్పూను
 • మిరియాల పొడి... అర టీస్పూను
 • కొత్తిమీర... ఒక కట్ట
 • పసుపు... కొంచెం
 • ఉప్పు... సరిపడా

విధానం:

కోడి మాంసాన్ని శుభ్రం చేసుకొని దాన్ని కొంచెం ఉప్పు, పసుపు కలిపిన నీళ్ళల్లో ఉడికించి కొన్ని నీళ్లు ఉండగానే దింపేయాలి. మొత్తం అల్లంలోని మూడో వంతు భాగాన్ని తీసి తురిమి ఉంచుకోవాలి. మిగిలిన అల్లాన్నంతటికీ మెత్తగా నూరుకోవాలి. కడాయిలో నూనె వేసి అల్లం పేస్టును వేసి కాఫీ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి. తరువాత దానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు కలిపి వేయించాలి. టొమోటోలు బాగా ఉడికిన తరువాత దానికి కారం, పెరుగు, అల్లం తురుము, ఉడికించిన మాంసం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. నీళ్ళన్నీ బాగా ఇగిరిపోయేదాకా కూరను బాగా ఉడికించి దించేముందు కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే వేడి వేడి దంకా జిగర్ చికెన్ రెడీ. ఇది చపాతీ, పరోటాలలోకి చాలా బాగుంటుంది.