పెరుగు పచ్చడి
 • 286 Views

పెరుగు పచ్చడి

కావలసినవి:

 • పుల్లటి పెరుగు : 1 కప్‌
 • అల్లం : 1 ముక్క
 • పచ్చిమిరపకాయలు : 2 కాయలు
 • కీరదోసకాయ : 2 కాయలు
 • కొత్తిమీర : 2 రెమ్మలు
 • కరివేపాకు : 2 రెమ్మలు
 • నూనె : 1 స్పూన్‌
 • ఆవాలు : 1 స్పూన్‌
 • మినపప్పు : 1 స్పూన్‌
 • ఉప్పు : తగినంత

విధానం:

అల్లం, పచ్చి మిరపకాయలను నూరిపెట్టుకోండి. కీరదోసకాయను తురిమిపెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకులను పెరుగులో వేసి తగినంత ఉప్పు చేర్చి కలుపుకోండి. అందులో తురిమిన కీరదోస చేర్చండి. ఆవాలు, మినపప్పును నూనెలో వేయించి పెరుగు మిశ్రమంలో కలపండి. పసందైన పెరుగుపచ్చడి రెడీ...