ఉల్లిపాయ పెరుగు పచ్చడి
  • 496 Views

ఉల్లిపాయ పెరుగు పచ్చడి

కావలసినవి:

  • ఉల్లిపాయలు - 2 (పెద్దవి)
  • క్యారట్ తురుము - కప్పు
  • కొబ్బరి తురుము - కప్పు, పెరుగు - మూడు కప్పులు
  • పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - ఒక కట్ట
  • ఉప్పు - తగినంత, పుదీనా - ఒక కట్ట

విధానం:

ఉల్లిపాయలను సన్నగా తురుములాగ కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని నీళ్లు పోయకుండా చిలకాలి. అందులో ఉల్లి తరుగు, క్యారట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చిన్న బాణలిలో నూనె వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి. ఈ పోపును తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.